ఇటీవల రాష్ట్రంలో జరిగిన సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. కాగా, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి.. డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ జరిగింది. డీసీసీబీలో 20 స్థానాలకు గానూ 18 మంది అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. డీసీఎంఎస్‌లో 10 డైరెక్టర్ పోస్టులు ఏకగ్రీవమయ్యాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. నూతనంగా ఎంపికైన డైరెక్టర్లను ప్రత్యేక బస్సులో శిబిరానికి తరలించారు. రెండు స్థానాల్లో రిజర్వేషన్ అభ్యర్థులు అందుబాటులో లేక నామినేషన్లు దాఖలు కాలేదు.