కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక కష్టాను ఎదుర్కొనేందుకు భారత్‌కు ప్రపంచబ్యాంకు బిలియన్ డాలర్ల అత్యవసర సాయాన్ని ప్రకటించింది. మొత్తం 25 అభివృద్ధి చెందుతున్న దేశాలకు 1.9 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన ప్రపంచబ్యాంకు అందులో ఒక బిలియన్ డాలర్లను భారత్‌కు కేటాయించినట్లు ప్రపంచబ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు డేవిడ్ మాల్‌పాస్ తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి త్వరగా కోలుకొనేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రస్తుత సమస్య పేద దేశాలకు చాలా క్లిష్టమైనదని తెలిపారు.
భారత్‌కు ప్రపంచబ్యాంకు బిలియన్ డాలర్ల సాయం